18 May, 2026 | 8:03 PM

Districts - Kumarambheem Asifabad

article_20994070.webp
సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): సింగరేణి సంస్థలో రిటైర్మెంట్ పొందిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సింగరేణి వాలంటరీ రిటైర్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Reg.No:4148/97) ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధికి జీవితాంతం కష్టపడ్డ కార్మికులు రిటైర్మెంట్ అనంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేల పెన్షన్ ఇవ్వడంతో పాటు ప్రతి మూడు నెలలకు పెరిగే డీఏను పెన్షన్‌లో కలపాలని డిమాండ్ చేశారు. ప్రతి రిటైర్డ్ కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, సొంత స్థలాలు ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని రిటైర్డ్ కార్మికులకు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

18-05-2026

article_79839697.webp
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల కమిటీ నాయకులు రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, రాముల నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కొండ్ర రాజేశ్వర్, కో-కన్వీనర్ ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాపర్తి అశోక్, ఎరుబోతుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

18-05-2026

article_77605735.webp
మార్లవాయిలో గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ నూతన సభ్యుల సన్మానం

జై నూర్,మే18 (విజయ క్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ సభ్యులను సోమవారం ఘనంగా సన్మానించారు. సన్మానితులైన వారిలో సార్ మేడి గేడం గణపత్ రావు, గీతాదర్ ఆత్రం భగవంత్ రావు, రాయి సెంటర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆడ సోనేరావు ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనక ప్రతిభ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ వ్యవస్థ పటిష్టతకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజం విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ముందుకు సాగేందుకు రాయి సెంటర్ కీలక పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు.

18-05-2026

article_11405527.webp
పంచాయతీ భవన పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎంపీడీవో సుధాకర్ రెడ్డి

జైనూర్ మే 18 (విజయక్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న పవర్‌గూడ గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మండల అభివృద్ధి అధికారి సుధాకర్ రెడ్డి కోరారు.సోమవారం ఆయన పవర్‌గూడ సర్పంచ్ తొడసం రాజేందర్‌తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు లోటు రాకుండా చూడాలని, నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తొడసం రాజేందర్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి భరత్, కరోబార్ ఉయిక జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

18-05-2026